Vivo Y300: రూ.25 వేల లోపు.. 80W ఛార్జింగ్‌తో ప్రీమియం డిస్‌ప్లే.! 4 d ago

Vivo సంస్థ మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని Vivo Y300 అనే సిరీస్‌ను రూపొందించింది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీని అందుబాటు ధరలో అందిస్తూ.. మంచి ఫీచర్లను కలిగి ఉంది. 5G కనెక్టివిటీ, శక్తివంతమైన ప్రాసెసర్, మంచి కెమెరా, మరియు పెద్ద బ్యాటరీతో ఇది మంచి పనితీరు అందిస్తుంది. అందుబాటు ధరలో అద్భుతమైన ఫీచర్లతో.. Vivo Y300 ప్రతి వినియోగదారుని ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. ఒకసారి ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.!
Vivo Y300 ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.67 అంగుళాల AMOLED
రిఫ్రెష్ రేటు: 120 Hz
ప్రాసెసర్: Qualcomm Snapdragon 4 Gen 2
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14
పీక్ బ్రైట్‌నెస్: 1800 nits
బరువు: 188
బ్యాటరీ: 5000 mAh
ఛార్జింగ్: 80W ఫ్లాష్ ఛార్జింగ్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా:
- 50 MP మెయిన్ కెమెరా
- 2 MP డెప్త్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 32 MP
వేరియంట్స్:
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G డ్యూయల్ సిమ్ + హైబ్రిడ్
- Wi-Fi 5
- బ్లూటూత్ v5.0, GPS
- USB టైప్-C ఆడియో జాక్
కలర్ ఆప్షన్స్:
- టైటానియం సిల్వర్
- ఎమెరాల్డ్ గ్రీన్
- ఫాంటమ్ పర్పుల్
సెన్సార్లు: ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్.
ఫోన్ ధర:
- 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ.21,999
- 8GB RAM, 256GB స్టోరేజ్-- రూ.23,999
మైనస్ పాయింట్స్:
- NFC లేదు
- ప్లాస్టిక్ బాడీ
- ఎక్కువ ప్రీ-ఇన్‌స్టాల్ యాప్‌లు
- వాటర్ నిరోధకత లేదు
చూశారుగా Vivo Y300 ఫీచర్లు.. సరసమైన ధరలో మధ్య శ్రేణి స్మార్ట్‌ఫోన్లు తీసుకురావడంలో వివో ని మించిన కంపెనీ లేదు. ఈ ఫోన్‌లో నీరు మరియు ధూళి నిరోధకత లేదు.. ఈ ఒక్క సదుపాయాన్ని కూడా అందించి ఉంటే, ఈ ధరలో Vivo Y300 చాలా మంచి ఫోన్ అయ్యేదే. మిగతా అన్ని ఫీచర్లు చూసుకుంటే చాలా బాగున్నాయి.. ఒక్కదానికి కూడా లోటు చెప్పడానికి లేదు. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్ తో పాటు ఆఫ్‌లైన్ లో కూడా అందుబాటులో ఉంది. మంచి కెమెరా, దీర్ఘకాలిక బ్యాటరీ, మరియు పెద్ద డిస్‌ప్లే వంటి ఫీచర్లతో Vivo Y300 ప్రీమియం అనుభవం అందిస్తూ.. అందుబాటులో ఉన్న ధరలో ఒక మంచి ఎంపిక అవుతుంది.
ఇది చదవండి: సూపర్ ఫీచర్లతో "శామ్సంగ్ గెలాక్సీ M06"..రూ.10 వేల కంటే తక్కువ ధరకే.!